ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కి సంబంధించి విధి విధానాలను చకచకా రూపొందిస్తుంది. వీలైనంత త్వరగా అర్హులకు నిరుద్యోగ భృతిని అందచేయాలని కొత్త ప్రభుత్వం అధికారులను అదేశించినట్లుగా తెలుస్తుంది. యువనేస్తం స్కీం ద్వారా నిరుద్యోగ భృతి అంద చేయాలని కొత్తగా వెబ్సైట్ రూపొందిస్తున్నారు. అది అందుబాటులోకి రాగానే విధి విధానాలను రూపొందించి దరఖాస్తు ఫారాలు తీసుకొనే అవకాశం ఉంది.
నిరుద్యోగ భృతి కి అర్హతలు ఏంటి?
సోషల్ మీడియా లో నిరుద్యోగ భృతి అర్హతలు గురించి విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
వయస్సు 22-35 ఉండాలని, ఆధార్ కార్డు కావాలి అని, 5 ఎకరాలు లోపే పొలం ఉన్నవాళ్ళకి ఇస్తారని, పట్టణాల్లో ఐతే 1500 లోపు చదరపు గజలు ఉన్నవాళ్ళకే అని, నెలకు ఆదాయం 10000 లకు మించరాదని, ఇలా రక రకాలుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి సూచనలు రాష్ట్రప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
ఎలక్షన్ కి ముందు వాగ్దానం చేసినట్లు గా మాట నిలబెట్టుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. యువనేస్తం ద్వారా నిరుద్యోగులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు.
నిరుద్యోగ భృతి అకౌంట్ లో పడాలి అంటే మాత్రం అన్ని సర్టిఫికెట్ లు ఉండాలి. ముఖ్యం గా బ్యాంక్ అకౌంట్, బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు, అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు. దీనికి సంబదించిన వెబ్సైట్ yuvanestham.ap.gov.in ఇంకా అందుబాటులోకి రాలేదు. నిరుద్యోగ భృతి గురించి అప్డేట్స్ తెలియాలి అంటే రోజూ మా వెబ్సైట్ నీ ఫాలో అవ్వండి.