APTET 2021 Syllabus Download in Telugu కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం ఉపాద్యాయ ఉద్యోగాల ఎంపికలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) లో అర్హత సాధించడం తప్పనిసరి. దీన్ని ప్రతీ రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు రాష్ట్రప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షలో కూడా టెట్ కు వెయిటేజీ ఇస్తారు. ఈ పరీక్ష సిలబస్ తెలుగులో క్రింది లింకుల ద్వారా దిగుమతి చేసుకోండి.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) 2021 పరీక్షా విధానం
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు పేపర్లు (పేపర్–1, పేపర్–2)గా ఉంటుంది.
పేపర్–1.. ఎస్జీటీ
- డీఈడీ అర్హతతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల ఔత్సాహికులకు ఉద్దేశించింది. అంటే.. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు బోధించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల కోసం నిర్దేశించిన పరీక్ష టెట్ పేపర్–1. టెట్ పేపర్ 1 మొత్తం ఐదు విభాగాలుగా ఆబ్జెక్టివ్ విధానంలో 150 ప్రశ్నలకు (150 మార్కులు) ఉంటుంది.
- పరీక్ష సమయం: రెండున్నర గంటలు.
- చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ.. 30 ప్రశ్నలు, 30 మార్కులకు; లాంగ్వేజ్–1.. 30 ప్రశ్నలు, 30 మార్కులకు; లాంగ్వేజ్–2.. 30 ప్రశ్నలు, 30 మార్కులకు; మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు, 30 మార్కులకు; ఎన్విరాన్మెంటల్ స్టడీస్æ 30 ప్రశ్నలు, 30 మార్కులకు ఉంటుంది. ఈ అయిదు పేపర్లలో లాంగ్వేజ్ పేపర్–1 మినహా మిగతా అన్నీ కంపల్సరీ పేపర్లే. లాంగ్వేజ్–1 పేపర్లను అభ్యర్థులు తమ ఆసక్తి, అర్హత మేరకు ఎంపిక చేసుకోవచ్చు.
- ఇందుకోసం తెలుగు, ఉర్దూ సహా మొత్తం ఎనిమిది లాంగ్వేజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
టెట్ పేపర్–2.. ఎస్ఏ
- బీఈడీ అర్హతగా ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ హోదాకు పోటీ పడాలనుకునే అభ్యర్థులకు ఉద్దేశించిన పేపర్.. టెట్ పేపర్–2. ఈ పేపర్ నాలుగు సెక్షన్లుగా 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.
- పరీక్ష సమయం: రెండున్నర గంటలు.
- చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ.. 30 ప్రశ్నలు, 30 మార్కులు; లాంగ్వేజ్–1.. 30 ప్రశ్నలు, 30 మార్కులు; లాంగ్వేజ్ 2.. 30 ప్రశ్నలు, 30 మార్కులు; మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్ కోసం మ్యాథ్స్, సైన్స్ 60 ప్రశ్నలు, 60 మార్కులు; సోషల్ స్టడీస్ టీచర్ కోసం సోషల్ స్టడీస్ 60 ప్రశ్నలు, 60 మార్కులకు ఉంటుంది.
- ఇందులో మొదటి మూడు విభాగాలు కామన్‌గా ఉంటాయి. మిగిలిన సబ్జెక్టును తమ సబ్జెక్ట్ మేరకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
- పేపర్–2లోనూ లాంగ్వేజ్–1 పేపర్లో తెలుగు, ఉర్దూ సహా ఏడు భాషలలో అభ్యర్థులు తమ ఆసక్తి, అర్హత మేరకు సదరు లాంగ్వేజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
Download APTET Syllabus in Telugu pdf format
1. AP TET – 2018 PAPER – 1 SYLLABUS IN TELUGU
2. AP TET – 2018 PAPER – 2 (A) MATHEMATICS SYLLABUS IN TELUGU
3. AP TET – 2018 PAPER – 2 (A) PHYSICAL SCIENCES SYLLABUS IN TELUGU
4. AP TET – 2018 PAPER – 2 (A) BIOLOGICAL SCIENCES SYLLABUS IN TELUGU
5. AP TET – 2018 PAPER – 2 (A) SOCIAL STUDIES SYLLABUS IN TELUGU
6. AP TET – 2018 PAPER – 2 (A) LP / SA TELUGU
7. AP TET – 2018 PAPER – 2 (A) LP / SA ENGLISH
8. AP TET – 2018 PAPER – 2 (B) PET / PD
Download APTET Official Syllabus in pdf format
PAPER-I Syllabus
PAPER-II (A) Languages Syllabus
PAPER-II (A) Social Studies Syallbus
PAPER-II (A) Mathematics & Science Syllabus
PAPER-II (B) Syllabus for Physical Education