ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల | 7,676 పోస్టులు, నవంబర్ 1 నుంచి దరఖాస్తులు

*నోటిఫికేషన్‌ జారీ

*నవంబర్‌ 1నుంచి 16వరకు దరఖాస్తుల స్వీకరణ
* నవంబర్ 1 నుంచి ఫీజ్ పేమెంట్

* నవంబర్ 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్

* నవంబర్ 17 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు

* నవంబర్ 19 నుంచి 24 వరకు పరీక్ష కేంద్రాల ఎంపిక .

* నవంబర్ 29 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ .

* స్కూల్ అసిస్టెంట్స్(నాన్ లాంగ్వేజ్) – డిసెంబర్ 6 నుంచి 10 వరకు పరీక్ష .

* స్కూల్ అసిస్టెంట్స్(లాంగ్వేజ్) – డిసెంబర్ 11న పరీక్ష .

* డిసెంబర్ 12, 13న పీజీ టీచర్స్ రాతపరీక్ష .

* లాంగ్వేజ్ పండిట్స్ పోస్టులు – 452 .

* 7,675 ఉద్యోగాలు భర్తీ .

* ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంపు.
* జనరల్ అభ్యర్థులకు 42 నుంచి 44 ఏళ్లకు వయోపరిమితి పెంపు.
* దివ్యాంగులకు 52 నుంచి 54 ఏళ్లకు వయోపరిమితి పెంపు.

*వివరాలు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు

AP DSC Schedule has been released Today by Minister Ganta Srinivasa Rao. 7,676 Posts will be filled.

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్‌ను గురువారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడలోని ఓ హోటల్ లో ఉదయం 9గంటలకు షెడ్యూల్‌ను ప్రకటించిన మంత్రి, దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సారి టెట్‌ కమ్‌ టీఆర్టీని నిర్వహిస్తామని ప్రకటించారు. అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల చేసి, నవంబరు 1 నుంచి దరఖాస్తులను స్వీకరణ మొదలవుతుందని తెలిపారు. నవంబరు 29నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబరు 6నుంచి పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఈడీఎస్సీ ద్వారా మొత్తం 7,676 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్జీటీలే అధికంగా ఉన్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టుల్లో బీఎడ్‌లకు అవకాశం కల్పిస్తున్నందున వీటికి పోటీ భారీగా ఉండే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు, జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు. ఆన్‌లైన్‌ విధానంలోనే రాత పరీక్షను నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు.

 

షెడ్యూల్ ఇదే

అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల,

నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ,

నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, .

నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు, .

డిసెంబర్‌ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్ష, .

డిసెంబర్‌ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ రాత పరీక్ష, .

డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాత పరీక్ష, .

డిసెంబర్‌ 17 పీఈటీ, మ్యూజిట్‌, క్రాప్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్ రాత పరీక్ష, .

 

శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల, నవంబర్‌ 1నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు గంటా తెలిపారు. నవంబరు 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాలను ఎంపికచేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. నవంబరు 17నుంచి ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. డిసెంబరు 6, 10 న స్కూల్‌ అసిస్టెంట్లకు, డిసెంబరు 11న ఎస్‌ఏ (లాంగ్వేజెస్‌), డిసెంబరు 12, 13 తేదిల్లో పీజీటీలకు పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 14, 26న టీచర్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు, డిసెంబర్‌ 17 పీఈటీ, మ్యూజిట్‌, క్రాప్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్‌ పోస్టులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. డిసెంబరు 28 నుంచి జనవరి 2 వరకు ఎస్జీటీ పోస్టులకు రాతపరీక్ష ఉంటుందని గంటా తెలిపారు.

స్కూల్ అసిస్టెంట్‌లకు డిసెంబరు 12, పీజీటీలకు డిసెంబరు 14న, పీఈటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ విభాగాలకు డిసెంబరు 18 న, టీజీటీ, ప్రిన్సిపాల్ డిసెంబరు 28, ఎల్పీటీలకు డిసెంబరు 28, సెకెండరీ గ్రేడ్ పోస్టులకు జనవరి 3 న కీ విడుదల చేస్తారు. వీటిపై అభ్యంతరాలను గడువు కీ విడుదలైన రెండు రోజుల వరకు స్వీకరిస్తారు. ఆయా పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తారు. తర్వాత రెండు రోజుల్లో మెరిట్ జాబితా, ఇది ప్రకటించిన రెండు రోజుల్లో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటిస్తారు.

ఇదిలా ఉంటే డీఎస్సీ ద్వారా 7,657 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గంటా వెల్లడించారు. ప్రభుత్వ, జెడ్పీ పాఠశాల్లో 4,341, మున్సిపల్‌ పాఠశాలల్లో 1,100, ఆదర్శ పాఠశాలల్లో 909, బీసీ సంక్షేమ శాఖలో 300, గిరిజన సంక్షేమ శాఖలో 800లతో సహా మొత్తం 7,676 పోస్టులను భర్తీచేయనున్నట్టు వెల్లడించారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్లు 1,625, లాంగ్వేజ్‌ పండిట్స్‌ 452, ఎస్జీటీలు 3,666 ఉన్నాయి. అభ్యర్థులకు వయోపరిమితి కూడా రెండేళ్ల సడలింపు ఇస్తున్నట్టు తెలిపారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు గరిష్టంగా 49ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

వాస్తవానికి జులైలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అనివార్య కారణాలతో ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 12వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి గంటా అప్పట్లో ప్రకటించారు. కానీ రేషలైజేషన్‌ పేరుతో కొన్ని పోస్టులను తొలగించారు. స్కూల్‌ అసిస్టెంట్‌లకు డిసెంబరు 12, పీజీటీలకు డిసెంబరు 14న, పీఈటీ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ విభాగాలకు డిసెంబరు 18 న, టీజీటీ, ప్రిన్సిపాల్‌ డిసెంబరు 28, ఎల్పీటీలకు డిసెంబరు 28, సెకెండరీ గ్రేడ్‌ పోస్టులకు జనవరి 3 న కీ విడుదల చేస్తారు. వీటిపై అభ్యంతరాలను గడువు కీ విడుదలైన రెండు రోజుల వరకు స్వీకరిస్తారు. ఆయా పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తారు. తర్వాత రెండు రోజుల్లో మెరిట్‌ జాబితా, ఇది ప్రకటించిన రెండు రోజుల్లో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటిస్తారు.

Related Posts

Check Also

TS 10th Time Table 2021: Telangana SSC Exam Dates, Fee Due Dates, Details and Exams | bse.telangana.gov.in

Download TS SSC Time Table 2021: TSBSE has recently announced The Telangana SSC Pubmilc Exam …