తెలంగాణా 18,428 పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అర్హత వివరాలు

TS Police Recruitment Notification for 18428 Posts – Telangana Police Notification in Telugu: తెలంగాణ పోలీస్‌ నియామక సంస్థ వివిధ విభాగాల్లో 18,428 పోస్టులకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులుండగా, 1217 ఎస్‌ఐ పోస్టులున్నాయి. అలాగే కమ్యూనికేషన్స్ కానిస్టేబుల్ 142, మెకానిక్ 19, డ్రైవర్ కు సంబంధించి 70 పోస్టులున్నాయి.

విద్యార్హత:

కానిస్టేబుల్ పోస్టులకు: ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌. ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌, డ్రైవ‌ర్ పోస్టుల‌కు నిబంధ‌ల మేర‌కు అర్హ‌త‌లు అవ‌స‌రం. ఎస్టీ అభ్య‌ర్థులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించి ఇంట‌ర్ రెండేళ్ల ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైతే స‌రిపోతుంది. 

ఎస్‌ఐ పోస్టులకు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఎస్టీ అభ్య‌ర్థులైతే ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌తోపాటు క‌నీసం మూడేళ్ల డిగ్రీ కోర్సు చ‌దివితే స‌రిపోతుంది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్ పోస్టుల‌కు ఈసీఈ/ ఈఈఈ/ సీఎస్‌/ ఐటీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త ఉండాలి. ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో పోస్టుల‌కు కంప్యూట‌ర్ సైన్స్ / ఐటీ/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ వీటొలో ఎందులోనైనా డిగ్రీ ఉండాలి. 

ఇంట‌ర్ ఉత్తీర్ణత. ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌, డ్రైవ‌ర్ పోస్టుల‌కు నిబంధ‌ల మేర‌కు అర్హతలు అవ‌స‌రం. ఎస్టీ అభ్యర్ధులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత సాధించి ఇంట‌ర్ రెండేళ్ల పరీక్షలకు హాజ‌రైతే స‌రిపోతుంది. ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ, కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలి.
వ‌య‌సు: పై అన్ని పోస్టుల‌కు జులై 1, 2018 నాటికి 18 – 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1996 కంటే ముందు, జులై 1, 2000 త‌ర్వాత జ‌న్మించిన‌వారు అన‌ర్హులు. డ్రైవ‌ర్ పోస్టుల‌కు 21-25 ఏళ్లలోపు వారు అర్హులు.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

కానిస్టేబుల్ పోస్టులకు: ఎస్సీ, ఎస్టీల‌కు రూ.400, మిగిలిన అంద‌రికీ రూ.800

ఎస్‌ఐ పోస్టులకు: ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.500, ఇతర కేటగిరీలకు చెందిన వారు రూ.1000
మరిన్ని వివరాలకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ www.tslprb.in చూడొచ్చు.

కానిస్టేబుల్ పోస్టుల వివరాలు

సివిల్ 5909
ఏఆర్ 5273
ఎస్‌ఏఆర్- ఎస్పీఎల్ 53
టీఎస్‌ఎస్పీ 4816
ఎస్పీఎఫ్ 485
ఫైర్‌మెన్ 168
జైల్ వార్డర్స్ (పురుషులు) 186
జైల్ వార్డర్స్ (మహిళలు) 35
మొత్తం 16,925

ఎస్‌ఐ పోస్టుల వివరాలు

ఎస్‌ఐ (సివిల్) 710
ఎస్‌ఐ (ఏఆర్) 275
ఎస్‌ఐ (టీఎస్‌ఎస్పీ) 175
ఎస్‌ఐ (టీఎస్‌ఎస్పీ-15వ బెటాలియన్) 16
ఫైర్ ఆఫీసర్ 19
డిప్యూటీ జైలర్స్ 15
ఎస్‌ఏఆర్- ఎస్పీఎల్ 05
మొత్తం 1217

చివరి తేదీ వివరాలు: 

అభ్యర్థులు జూన్ 9 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన లింకులు: 

Related Posts